ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి CSR నిధులతో ముందుకొచ్చిన సంస్థలు

తెలంగాణలో ప్రభుత్వ విద్యాభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల ద్వారా పలు సంస్థలు సహకరించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ముఖ్యమంత్రి A. Revanth Reddy సమక్షంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈ ఒప్పంద కార్యక్రమం జరిగింది.

ఈ సమావేశంలో రహేజా గ్రూప్ అధ్యక్షుడు Neil C. Raheja, రామ్‌కీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ Alla Dakshayani, యశోదా గ్రూప్ డైరెక్టర్ Gorukanti Devender Rao పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖతో కుదిరిన ఒప్పంద పత్రాలను పరస్పరం అందజేశారు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌లో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతి గదుల నిర్మాణానికి అవసరమైన మొత్తం వ్యయంలో 40 శాతం అంటే రూ.19.66 కోట్లను రామ్‌కీ సంస్థ ఖర్చు చేయనుంది. అలాగే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ZPHS ఉన్నతీకరణలో భాగంగా ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు గదుల నిర్మాణానికి రూ.10.4 కోట్ల మేర సహకారం అందించేందుకు రామ్‌కీ సంస్థ ముందుకొచ్చింది.
రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతి గదుల నిర్మాణానికి అవసరమైన రూ.50.50 కోట్లను రహేజా గ్రూప్ వెచ్చించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇక మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ సుభాష్‌నగర్ MPPS పాఠశాలలో ప్రీ-ప్రైమరీ, 6వ మరియు 7వ తరగతుల గదుల నిర్మాణానికి అవసరమైన రూ.12.20 కోట్లను యశోదా హాస్పటల్స్ CSR నిధుల ద్వారా ఖర్చు చేయనున్నట్లు తెలిపింది.

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి Yogita Rana, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ Devasena, సీఎం ప్రత్యేక కార్యదర్శి Ajith Reddy, IGBC ఛైర్మన్ C. Shekar Reddy పాల్గొన్నారు.
ప్రభుత్వ విద్యాభివృద్ధికి CSR ద్వారా ముందుకొచ్చిన సంస్థలను ముఖ్యమంత్రి అభినందించారు. ఈ చర్యల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి.

ஹைதராபாத் நகர்ப்புற பகுதிகளில் அரசு பள்ளிகள் மேம்பாட்டிற்காக ரஹேஜா குழுமம், ராம்கி ஃபவுண்டேஷன் மற்றும் யசோதா ஃபவுண்டேஷன் ஆகியவை CSR நிதி மூலம் பல கோடி ரூபாய் செலவிட ஒப்பந்தம் செய்துள்ளன. தெலங்கானா முதல்வர் A. Revanth Reddy முன்னிலையில் இந்த ஒப்பந்தங்கள் கையெழுத்தானது. ஜவஹர்நகர், துக்குகுடா, கொண்டாபூர் மற்றும் உப்பல் பகுதிகளில் புதிய வகுப்பறைகள் மற்றும் கல்வி கட்டமைப்பு வசதிகள் அமைக்கப்பட உள்ளன. அரசு பள்ளி மாணவர்களுக்கு தரமான கல்வி சூழல் உருவாக்க இந்த திட்டங்கள் உதவும் என அரசு தெரிவித்துள்ளது.
Several corporate organizations have come forward under CSR initiatives to support government school development in Hyderabad core urban areas. In the presence of Telangana Chief Minister A. Revanth Reddy, Raheja Group, Ramky Foundation and Yashoda Foundation signed agreements with the Education Department. The projects include construction of classrooms from pre-primary to intermediate level in Jawaharnagar, Tukkuguda, Kondapur and Uppal areas. Corporate funding worth several crores will be utilized for infrastructure development in government schools. The Telangana government stated that these initiatives will improve educational facilities and provide better learning environments for students.
